- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బంగారు తెలంగాణ సాధ్యమయ్యేది అప్పుడే: కేకే
దిశ, తెలంగాణ బ్యూరో: అందరికీ సమాన హక్కులు సాధించినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమని.. ఆ దిశగా ముందుకు సాగుతున్నామని ఎంపీ కేశవరావు అన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం తెలంగాణ భవన్‌లో పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏకైక లక్ష్యమని.. అందుకే ఉద్యమానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. 13 ఏళ్ల సుదీర్ఘ పోరాటం ప్రజా ఉద్యమం.. ప్రజల ఉద్యమం.. ఆత్మ గౌరవ ఉద్యమం అనే నినాదంతో ముందుకు సాగామన్నారు. ఇదే క్రమంలో కేసీఆర్ టీఆర్ఎస్‌ను ప్రారంభించి ఉద్యమాన్ని తీవ్రతరం చేశారని గుర్తు చేశారు. తొలిదశలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడలేదని.. మలిదశ ఉద్యమంలో పకడ్బందీగా పక్కా వ్యూహాలతో గాంధీ సిద్ధాంతాలతో ఉద్యమించి కేసీఆర్ తెలంగాణను సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు శ్రీనివాస్ రెడ్డి మహేందర్ రెడ్డి, చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్, టిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.