- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేసీఆర్‌కు రేవంత్ రెండో కొడుకు.. ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు
దిశ ప్రతినిధి, కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత విజయ్ మాల్యా మాదిరి విదేశాలకు పారిపోవడం ఖాయం అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. శనివారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… అప్పుగా తీసుకొచ్చిన రూ. 4.5 లక్షల కోట్లలో 30 శాతం కమీషన్ల పేరిట కేసీఆర్ కుటుంబం తమ జేబుల్లో వేసుకున్నదని మండిపడ్డారు. 25 ఏళ్ల కింద ‘దళిత చైతన్య జ్యోతి’ మొదలు పెడితే సిద్దిపేట దళితులు నేటికీ కోటీశ్వరులు కాలేదని ఎద్దేవా చేశారు. అతి చేయడానికి కూడా లిమిట్ ఉండాలని, కేసీఆర్ మాటలు చెప్పినట్లు చేతలు ఉండవని, ప్రపంచంలో ఇంకెవరు ఆయనలాగా మాట్లాడలేరని దుయ్యబట్టారు. తెలంగాణ ట్రాన్స్‌కో లక్షా పదివేల కోట్ల అప్పుల పాలైందని, ప్రతీ యూనిట్‌కి కేటీఆర్ కమీషన్ తీసుకుంటున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. మిషన్ భగీరథ మొత్తం అవినీతిమయం అయిందని తెలిపారు. ముఖ్యమంత్రి సిగ్గులేనోడని, పదే పదే అబద్ధం చెప్తుంటాడని విమర్శించారు.
ప్రస్తుతం.. మాట్లాడితే దళితుల అభివృద్ధి అంటున్నాడు.. ఇంతకాలం కేబినెట్‌లో ఒక్క దళిత మంత్రిని కూడా ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. కేంద్ర కేబినెట్‌లో సామాజిక న్యాయం ఉందని, 12 మంది ఎస్సీలు, 27మంది బీసీలు, 8 మంది ఎస్టీలు, 11మంది మహిళలు మంత్రులుగా ఉన్నారని స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ పాదాలు సీఎం కేసీఆర్ కడిగి నీళ్ళు నెత్తిమీద చల్లుకోవాలని సూచించారు. సామాజిక న్యాయం అంటే ఏంటో ప్రధాని మోడీ దగ్గర నేర్చుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో ‘దళితబంధు’ ఒక్క కుటుంబానికి ఇవ్వకపోయినా టీఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. ‘దళితబంధు’ క్రెడిట్ కేవలం ఈటల రాజేందర్‌కే దక్కుతుందన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేస్తామన్న 125 అడుగుల విగ్రహం ఏమైందో చెప్పాలని నిలదీశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 2023 ఎన్నికల వరకూ కేసీఆర్‌కు రెండో కొడుకు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు గొర్లు, బర్లు ఇవ్వడం కాదని, కేసీఆర్ కొడుకు, బిడ్డకు పదిగొర్లు, పది బర్లు ఇచ్చి వాటిని సాదే పనిచెప్పాలని విమర్శించారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, హుజురాబాద్ టౌన్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, కరీంనగర్ జిల్లా జెడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ, మైలార్‌దేవ్‌పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు.