ప్రగతి‌భవన్ మాఫియా డెన్‌గా మారింది: ఎంపీ అర్వింద్

by Shyam |
ప్రగతి‌భవన్ మాఫియా డెన్‌గా మారింది: ఎంపీ అర్వింద్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కేసీఆర్ ఎంగిలి మెతుకులకు ఆలవాటు పడిన గులాబీ నేతలు బీజేపీపై పిచ్చికూతలు కూస్తే చూస్తూ ఉరుకోబోమని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం బీజేపీ నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ అని, దానిలో వారసత్వ రాజకీయాలకు చోటు లేదని, తరుణ్ చుగ్ గురించి మాట్లాడే అర్హత టీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. బీజేపీకి భయపడి జీహెచ్ఎంసీ ఎన్నికలు ముందస్తుగా నిర్వహించిన కేసీఆర్ ప్రస్తుతం నూతన సభ్యుల చేత పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఎందుకు చేయించడంలేదని ప్రశ్నించారు.

ఉద్యమంలో ముందు నుంచి ఉన్న వాళ్లు కనుమరుగయ్యారని, ప్రస్తుతం ప్రగతి భవన్ మాఫియా డెన్‌గా మారిందని ఆరోపించారు. మైనింగ్ వ్యవహారంలో కేసీఆర్, ఆయన కుటుంబం జైలుకెళ్లడం ఖాయమన్నారు. సీఎంతో సహా టీఆర్ఎస్ నేతలు ఒవైసీకి చెంచాగిరి చేస్తూ, హిందుత్వాన్ని ఒవైసీ దగ్గర తాకట్టు పెట్టారని విమర్శించారు. తెలంగాణ ద్రోహులందరూ మంత్రులయ్యారని, ప్రొఫెసర్ జయశంకర్‌ను కంటతడి పెట్టించిన మూర్ఖుడు కేసీఆర్ అని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారమని, టీఆర్ఎస్ సింగిల్ డిజిట్‌కే పరిమితం కానుందని జోస్యం చెప్పారు.

Advertisement

Next Story