టీకా కేంద్రంలో బీజేపీ నేత ‘బర్త్ డే’ వేడుకలు.. అధికారులు సీరియస్

by Anukaran |   ( Updated:2024-06-29 15:48:27.0  )
టీకా కేంద్రంలో బీజేపీ నేత ‘బర్త్ డే’ వేడుకలు.. అధికారులు సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్ : మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ బీజేపీ నాయకురాలు చేసిన పనికి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా నిబంధనలు పాటించకుండా ఏకంగా టీకా కేంద్రంలోనే పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం తీవ్ర విమర్శలకు గురిచేస్తోంది. వివరాల ప్రకారం.. ఇండోర్‌ పట్టణంలోని 58వ వార్డు అధ్యక్షురాలు మాధురీ జైస్వాల్.. టీకా కేంద్రంలో వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుండగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. వేడుకల్లో పాల్గొన్న కార్యకర్తలు భౌతిక దూరం పాటించకుండా.. మాస్కులు ధరించకుండా.. కరోనా నిబంధనలను బ్రేక్ చేశారు.

Click Here For Video...

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మాధురీ స్పందించారు. తాను వద్దని చెప్పినప్పటికీ.. తన మద్దతుదారులు ఈ వేడుకలను నిర్వహించినట్టు తెలిపారు. టీకా కేంద్రంలో ఇలా చేసినందుకు క్షమాపణ కోరుతున్నానని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇమ్యునైజేషన్​అధికారి డా. ప్రవీణ్ కుమార్​స్పందిస్తూ.. ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. టీకా కేంద్రంలో ఇలా వేడుకలు నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story