- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్‌కు దోపిడీపై ఉన్న శ్రద్ధ కరోనాపై లేదు
దిశప్రతినిధి, ఆదిలాబాద్: తెలంగాణలో సహజ వనరులు తీవ్రంగా దోపిడీకి గురవుతున్నారని ఇందులో సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు వాటాలు పంచుకుంటున్నారని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు సోయం బాపూరావు ఆరోపించారు. ఆదివారం ఆయన నిర్మల్ జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిర్మల్ జిల్లాలో తీవ్రమైన ఇసుక దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ నిర్మల్ జిల్లా బోథ్- అడెల్లి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు కాకపోయినప్పటికీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే రెండేసి సార్లు శంకుస్థాపన చేశారని విమర్శించారు. ఇందుకు సంబంధించిన నిధుల మంజూరు పత్రాన్ని విడుదల చేయాలని, లేదంటే రెండు జిల్లాల ప్రజలకు వీరిద్దరూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ఖర్చు చేస్తున్న నిధులన్నీ కేంద్రం మంజూరు చేసినవేనని చెప్పారు. ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా కరోనా కోసం ఖర్చు చేయలేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో నిరంతరం కరోనా పరీక్షలు నిర్వహిస్తుంటే… ఇక్కడ మాత్రం ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు తిరగబడితే టిఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టే సమయం ఎంతో దూరం లేదన్నారు. సచివాలయాన్ని కూల్చివేసి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో సీనియర్ నాయకులు రాంనాథ్, భూమయ్య, రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.