- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మైనార్టీ ఓట్ల కోసం హిందువులపై దాడులా..!
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ‘ఆంగ్లేయులు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన కుమ్రం భీ, రాంజీగోండు సాక్షిగా చెబుతున్నా..! తెలంగాణలో రాక్షస పాలన సాగుతోంది. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే దాకా నిద్ర పోను. అధికారం శాశ్వతం అనుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్లు తెరిచేలా ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పార్టీ పోరాటం చేస్తోంది. వచ్చే 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది’ అని ఆ పార్టీ స్టేట్చీఫ్ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం తొలిసారిగా పర్యటించిన ఆయన పలు చోట్ల కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ను గద్దె దింపే దాకా ప్రజలతో కలిసి తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందువులపై తెలంగాణలో దాడులు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. నిర్మల్ జిల్లా భైంసాలో హిందువులపై జరిగిన దాడుల విషయంలో ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ధ్వజ మెత్తారు. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి పార్టీని బలమైన శక్తి ఎదిగేలా కృషి చేస్తానని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో పర్యటించిన ఆయన పార్టీ శ్రేణులతో మాట్లాడరు. జిల్లాలో నెలకొన్న సమస్యలపై అడిగి తెలుసుకున్నారు.
మంచిర్యాల నుంచి నిర్మల్ వరకు…
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తొలిసారి వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్విరామంగా పర్యటన చేశారు. ఉదయం 9 గంటలకు తూర్పు మంచిర్యాల జిల్లా కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బెల్లంపల్లి, తాండూర్, రెబ్బెన ఆసిఫాబాద్ మీదుగా కుమ్రం భీం పురిటిగడ్డ జోడేఘాట్ కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు నివాళులర్పించిన తర్వాత గిరిజనుల తో భేటీ అయ్యారు. జైనూర్, ఉట్నూర్ క్రాస్ రోడ్డు మీదుగా ఇంద్రవెల్లి చేరుకున్నారు. అక్కడి గిరిజనులు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఆ తర్వాత గుడిహత్నూర్, ఇచ్చోడ, నేరడిగొండ మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకుని ఆంగ్లేయులతో పోరాడిన రాంజీగోండును ఉరితీసిన వేయి ఉరుల మర్రి ప్రాంతాన్ని సందర్శించారు.
అమరవీరుల స్తూపానికి నివాళి..
తన పర్యటనలో భాగంగా బండి సంజయ్ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఆయన పర్యటన ఆద్యంతం బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. దేశాన్ని పీడించిన ఆంగ్లేయులు, తెలంగాణను వేధించిన రజాకార్లను ఎదిరించిన అమరవీరుల ప్రాంతాలను సందర్శించడం సంజయ్ పర్యటనలో హైలెట్ గా నిలిచింది. ఈ పర్యటన తెలంగాణ సమాజాన్ని ఆలోచింప చేసేదిగా ఉందని మేధావి వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఈ పర్యటన ప్రారంభం నుంచి చివరి దాకా సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. సంజయ్ పర్యటన విజయవంతం కావడంతో కమలనాథుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తుంది.