ఎంపీ అర్వింద్‌ ర్యాలీ.. తల్వార్లతో యువకుల హల్‌చల్

by Sridhar Babu |
ఎంపీ అర్వింద్‌ ర్యాలీ.. తల్వార్లతో యువకుల హల్‌చల్
X

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ జగిత్యాల జిల్లా పర్యటన స్థానికంగా కలకలం రేపింది. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లిపూర్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణకు అరవింద్ మంగళవారం హాజరయ్యారు. ఈ ర్యాలీలో భాగంగా కొంత మంది యువకులు తల్వార్లతో నృత్యాలు చేస్తూ హంగామా సృష్టించారు. సమాచారం అందుకున్న పోలీసులు కత్తులతో బహిరంగంగా ప్రదర్శన చేసిన ఏడుగురు యువకులను అరెస్టు చేశారు. అంతేగాకుండా అంతకముందు ఎంపీ అరవింద్ కూడా ఇక్కడ స్థానిక యువకులతో తల్వార్ తిప్పినట్టుగా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story