షారుఖ్‌తో కరచాలనం.. శరీరమంతా కరెంట్ పాస్ అయింది: జీషన్

by Prasanna |   ( Updated:2023-07-04 08:49:30.0  )
షారుఖ్‌తో కరచాలనం.. శరీరమంతా కరెంట్ పాస్ అయింది: జీషన్
X

దిశ, సినిమా: ప్రముఖ నటుడు మొహమ్మద్ జీషన్ అయ్యూబ్.. తన ఫేవరేట్ యాక్టర్ షారుఖ్‌తో మొదటి సమావేశం గురించి ఆసక్తికర విషయం వెల్లడించాడు. షారుఖ్ ఖాన్‌తో ‘రయీస్’, ‘జీరో’ సినిమాల్లో కలిసి పనిచేసిన మొహమ్మద్ జీషన్.. రీసెంట్‌ ఇంటర్వ్యూలో కెరీర్ అనుభవాలను గుర్తుచేసుకున్నాడు. ‘ఫస్ట్ టైమ్ నేను షారుఖ్ బాయ్‌ని కలిసినపుడు మాటల్లో చెప్పలేని ఆనందం నా మొఖంలో కనిపించింది. అతను చేయిచాచి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చినపుడు నిజంగా నా శరీరం ద్వారా కరెంట్ ప్రవహిస్తున్నట్లు అనిపించింది’ అని చెప్పాడు. అలాగే తాను చిత్ర పరిశ్రమ నుంచి వైదొలగాలని ఆలోచిస్తున్నపుడు కూడా షారుఖ్‌ను కలిశానన్న జీషన్.. అతని మాటలు విన్న తర్వాత కెరీర్‌లో ఇంకా ఎంతో చేయాల్సి వుందని, దానికోసం తనను తాను మరింత తీర్చిదిద్దుకోవాలనే తపనతో ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలిపాడు.షారుఖ్‌తో కరచాలనం.. శరీరమంతా కరెంట్ పాస్ అయింది: జీషన్షారుఖ్‌తో కరచాలనం.. శరీరమంతా కరెంట్ పాస్ అయింది: జీషన్

Read More..

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌లా మారాలని ఉంది: స్టార్ నటి సెన్సేషనల్ కామెంట్స్

సెట్స్‌లో తీవ్రంగా గాయపడిన షారుఖ్ ఖాన్..!

Advertisement

Next Story