Mehreen Firzada: హాస్పిటల్ బెడ్ పై యంగ్ హీరోయిన్ మెహ్రీన్.. ఆందోళనలో ఫ్యాన్స్(పోస్ట్)

by Kavitha |   ( Updated:2024-08-10 09:32:23.0  )
Mehreen Firzada: హాస్పిటల్ బెడ్ పై యంగ్ హీరోయిన్ మెహ్రీన్.. ఆందోళనలో ఫ్యాన్స్(పోస్ట్)
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని నటించిన ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరోయిన్ మెహ్రీన్ అందరికీ సుపరిచితమే. తర్వాత ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, ‘జవాన్’, ‘పంతం’, ‘F2’, ‘F3’, ‘మంచి రోజులు వచ్చాయి’ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలా తెలుగులో అతి తక్కువ సమయంలోనే తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకుంది. ఇక కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం చేసుకుంది. కానీ, ఎంగేజ్‌మెంట్ అయిన కొన్ని రోజులకే పెళ్లి రద్దు చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత కొన్నాళ్లు సైలెంట్ అయిన మెహ్రీన్ ఎఫ్ 3 మూవీతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ భామ సినిమాలకు దూరంగా ఉంటుంది.

ఇదిలా ఉంటే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతూ తన అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ అమ్మడు పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఆ పోస్ట్‌లో భాగంగా చేతికి సెలైన్ పెట్టుకొని ఉన్న హ్యాండ్ పిక్‌ను షేర్ చేసింది. దీంతో ఆ పోస్ట్ కాస్త వైరల్‌గా మారింది.. ఇక ఆ ఫొటో చూసిన ఆమె ఫ్యాన్స్ మెహ్రీన్‌కు ఏమైంది అని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.


Advertisement

Next Story