కిడ్నీలు అమ్ముకున్న నటుడు ప్రియదర్శి..! పోస్ట్ వైరల్

by sudharani |
కిడ్నీలు అమ్ముకున్న నటుడు ప్రియదర్శి..! పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘టెర్రర్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నటుడు ప్రియదర్శి పులికొండ. ప్రతీ సినిమాలో తన నటనతో, కామెడీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ‘జాతి రత్నాలు’, ‘బలగం’ లాంటి సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే వరుస సినిమాలు చేస్తూనే.. వెబ్ సిరీస్‌లో కూడా దూసుకుపోతున్నాడు.

ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ప్రియదర్శి తాజాగా ఓ ఫొటో షేర్ చేశాడు. అందులో షర్ట్ లేకుండా నగ్నంగా దర్శనమిచ్చాడు. అంతే కాకుండా ఆయన ఒంటిపై గాయం కూడా కనిపిస్తోంది. ఈ ఫొటో కాస్త నెట్టింట వైరల్ కావడంతో.. ‘‘కిడ్నీలు అమ్ముకున్నావా బ్రో’, ‘ఇది నిజంగా జరిగిన గాయామా.. లేక సినిమా కోసం పెట్టుకున్న గాయామా’’ అంటూ రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story

Most Viewed