చక్రవాకం సీరియల్ హీరోయిన్ స్రవంతి .. ఇప్పుడు ఎలా మారిపోయిందో చూస్తే షాక్ అవుతారు

by Kavitha |
చక్రవాకం సీరియల్ హీరోయిన్ స్రవంతి .. ఇప్పుడు ఎలా మారిపోయిందో చూస్తే షాక్ అవుతారు
X

దిశ, సినిమా: కొన్ని సీరియల్స్ ముగిసిపోయి చాలా కాలం అవుతున్న బుల్లితెర ప్రేక్షకులు మాత్రం ఈ సీరియల్స్ ఎప్పటికీ గుర్తుండి పోతాయి.అలాంటి ఫేమ్ సీరియల్స్ లో ‘చక్రవాకం’ ఒకటి. 2003 నవంబర్ 3 నుండి 2008 ఫిబ్రవరి 15 వరకు రన్ అయిన ఈ సీరియల్.. స్టార్ట్ అయ్యిందంటే చాలు మహిళలు టీవీల ముందు నుంచి కదిలే వారు కాదు. అందుకే ఈ సీరియల్‌లో నటించిన అందరికి మంచి పేరు వచ్చింది. మంజులా నాయుడు దర్శకత్వం వహించిన ఈ సీరియల్‌లో కొందరు నటులు మధ్యలోనే మాయం అయ్యారు. మరికొందరు సీరియల్ చివరి ఎపిసోడ్ వరకు ఉన్నారు.

అయితే మెన్ హీరోయిన్ స్రవంతి గుర్తుందా..? అప్పటిలో సినిమా హీరోయిన్స్ కు మించిన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమె పేరు ప్రీతి అమీన్. ఈ అమ్మడు ‘చక్రవాకం’ సీరియల్ తో పాటు ‘అలౌకిక’, ‘నాన్న’ వంటి సీరియల్స్‌లో కూడా నటించింది. ఇక రీసెంట్‌గా ఈ ‘చక్రవాకం’ యాక్టర్ చనిపొవడంతో ఈ సీరియల్ పేరు వార్తల్లో హాట్ టాపిక్‌గా ఉంది. ఇందులో భాగంగా స్రవంతి ఇప్పుడు ఎలా ఉంది అని చాలా మంది సోషల్ మీడియాలో వెతకడం మొదలెట్టారు. ఈ క్రమంలో ప్రీతి ,లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి. ప్రీతి సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండదని తెలుస్తోంది. లేటెస్ట్ పిక్స్ లో మాత్రం అప్పటి లాగానే సన్నగా అందంగా ఉంది ప్రీతి.



Advertisement

Next Story