'Salman Khan ఎంత శాడిస్టో మీకు తెలియదు'..

by Hamsa |   ( Updated:2022-08-20 05:58:48.0  )
Salman Khan ఎంత శాడిస్టో మీకు తెలియదు..
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సల్మాన్ ఖాన్‌, సోమీ అలీ 10 ఏళ్ల పాటు ప్రేమలో ఉండి బ్రేకప్ చెప్పుకున్నారు. దీంతో సోమీ సినిమాలకు గుడ్ ‌బై చెప్పి అమెరికా చెక్కేసింది. అయితే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ చాన్స్ వచ్చినప్పుడల్లా ఘాటు వ్యాఖ్యలతో సల్మాన్ ఖాన్‌పై విరుచుకుపడుతోంది. తాజాగా, మరోసారి సల్మాన్ ఖాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేసింది.

''మైనే ప్యార్ కియా' పోస్టర్‌ షేర్‌ చేస్తూ.. ఉమెన్‌ బీటర్‌ తరచూ అమ్మాయిలు కొడుతుంటాడు. నాతో సహా ఎంతోమంది మహిళలపై అతడు చేయి చేసుకున్నాడు. అతన్ని గొప్పగా కీర్తించడం మానేయండి. అతనో శాడిస్ట్‌, ఎంతటి శాడిస్టో మీకు తెలియదు'' అంటూ పోస్టు పెట్టి డిలీట్ చేసింది. అది చూసిన నెటిజన్లు స్క్రీన్ షాట్లు తీసి ట్విట్టర్‌లో షేర్ చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.

Advertisement

Next Story