- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YASHODA మూవీలో పొరపాటు జరిగిందని ఒప్పుకున్న ప్రొడ్యూసర్
దిశ ,తెలంగాణ బ్యూరో : యశోద మూవీలో 'ఇవ ఐవీఎఫ్' (EVA IVF) పేరును తొలగిస్తున్నట్లు ప్రొడ్యూసర్ శివలింగ కృష్ణ ప్రసాద్ తెలిపారు. అనుకోకుండా పొరపాటు జరిగిందన్నారు. కోర్టు నుంచి సమాచారం అందగానే ఇవ-ఐవీఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ రావుతో సంప్రదింపులు చేశామన్నారు. సరోగసీ స్కామ్‌ను వెలికితీసే ప్రయత్నంలో ఇవ ఐవీఎఫ్ సంస్థ పేరును వాడుకోవడo తప్పిదమే అన్నారు. ఇక నుంచి ఇవ-ఐవీఎఫ్ ఫెర్టిలిటీ ఆస్పత్రి సంస్థ పేరు సినిమాలో ఎక్కడా కనిపించదన్నారు. సెన్సార్ బోర్డ్ మార్గదర్శకాల ప్రకారం సినిమాలో అభ్యంతరకర పేర్లను తొలగిస్తున్నామన్నారు. అయితే దీనికి కాస్త టైం పడుతుంది అన్నారు. కేవలం వారం రోజుల లోపే వివాదానికి బ్రేక్ పడుతుంది అన్నారు. పాజిటివ్‌గా స్వీకరించిన ఎండి మోహన్ రావుకు ధన్యవాదాలు తెలిపారు.
ఇవ ఐవీఎఫ్ ఎండి మోహన్ రావు మాట్లాడుతూ తమకు సినిమాపై ఎలాంటి అభ్యంతరం లేదని, కేవలం తమ సంస్థ బ్రాండ్ పేర్లను తొలగిస్తే సరిపోతుందన్నారు. రూల్ ప్రకారం న్యాయస్థానాలని ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. భవిష్యత్తులో ఏ సినిమాలోనూ ఇవ ఐవీఎఫ్ పేరును వాడుకో రాదన్నారు. సమాజంలో ప్రతి వ్యవస్థలో ఉన్నట్లే మంచి, చెడు రెండు కలిసే ఉంటాయన్నారు. కానీ పూర్తిగా వ్యవస్థను టార్గెట్ చేసి తప్పు పట్టడం సరికాదన్నారు. తప్పు చేసిన వాళ్లని శిక్షిస్తూనే సమాజానికి మేలు చేసే వారిని అభినందించాల్సి ఉంటుందన్నారు. అన్ని హాస్పిటల్స్‌లలో తప్పిదాలు జరుగుతాయని అనుకోవడం పొరపాటు అన్నారు.
ఇవి కూడా చదవండి : ది కశ్మీర్ ఫైల్స్'పై ఇజ్రాయెల్ ప్రొడ్యూసర్ కామెంట్స్ వైరల్.. డైరెక్టర్ ఫైర్