Yami Gautam: బ్యూటీ సీక్రెట్స్ బయటపెట్టిన యంగ్ బేబి.. అమ్మ చెప్పిందే చేస్తానంటూ

by Hajipasha |   ( Updated:2022-09-05 06:14:00.0  )
Yami Gautam: బ్యూటీ సీక్రెట్స్ బయటపెట్టిన యంగ్ బేబి.. అమ్మ చెప్పిందే చేస్తానంటూ
X

దిశ, సినిమా: బాలీవుడ్ యాక్ట్రెస్ యామీ గౌతమ్‌ తన బ్యూటీ సీక్రెట్ ఏంటో చెప్పేసింది. నిత్యం నిగనిగలాడే చర్మ సౌందర్యంతో అభిమానులను అట్రాక్ట్ చేసే భామ తన ఫాలోవర్ల కోసం కొన్ని చిట్కాలు షేర్ చేసింది. టీనేజ్ నుంచి ఇంట్లో అమ్మ చెప్పిన పద్ధతులే పాటిస్తానన్న యామీ.. కొత్తగా గ్లో తెచ్చుకోవడం కన్నా ఒరిజినల్ స్కిన్‌‌ ఎలాంటి మార్పులకు లోనవకుండా సంరక్షించుకుంటానని తెలిపింది. అలాగే ఎప్పుడూ అందం మీదే దృష్టి పెడతానన్న నటి.. 'బియ్యం పిండిలో పాలు కలిపి స్క్రబ్బర్‌లా యూజ్‌ చేస్తాను. కొంచెం తేనెలో కాస్త గ్లిజరిన్, ఓ టీస్పూన్‌ నిమ్మరసం, రోజ్‌ వాటర్‌ కలిపి మృదువుగా ముఖానికి అప్లయ్ చేస్తాను. ఇది క్లెన్సర్‌లా పనిచేయడమే కాక చర్మంలోని తేమను కాపాడుతుంది. నేచురల్‌గా ఉండే పదార్థాలే చర్మానికి మెరుపుదనాన్ని ఇస్తా్యి' అని చెప్పుకొచ్చింది. ఇక ఫెయిర్‌ అండ్‌ లవ్లీ యాడ్‌తోనే ఎక్కువ పాపులర్‌ అయినప్పటికీ ప్రొఫెషనలిజంలో అలాంటివి చేయక తప్పదని సెలవిచ్చింది.

Also Read : Renu Desai: తోడు కావాలంటూ రేణు దేశాయ్ పోస్ట్.. అందుకోసమేనా?

Advertisement

Next Story