ప్రమాదవశాత్తు చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి

by Kalyani |   ( Updated:2024-11-17 16:15:57.0  )
ప్రమాదవశాత్తు చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి
X

దిశ, తలకొండపల్లి : మండలంలోని వెల్జాల్ సహదేవి సముద్రంలో ఆదివారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన వద్దే ఈశ్వర్ (36) అనే యువకుడు చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు తలకొండపల్లి ఏఎస్ఐ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. పోలీసుల కథనం మేరకు వివరాలు వద్దే ఈశ్వర్ తాగిన మైకంలో అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులు, తన తమ్ముడు రాజు తో కలిసి చేపలు పట్టడానికి చెరువులోకి వెళ్లిన సమయంలో చేపల వల కాళ్లకు తట్టుకొని నీటిలో మునిగి ఉంటాడని పేర్కొంటున్నారు. నీటిలో మునిగిపోతున్న ఈశ్వరుని గుర్తించిన తన తమ్ముడు రాజు మరో యువకుడు అజయ్ కుమార్ వెంటనే చెరువులోకి దూకి బయటకి తీసేలోపే ఈశ్వర్ నీళ్లు మింగి మృతి చెందినట్లు ఏఎస్ఐ విష్ణువర్ధన్ తెలిపారు. తరచూ ఈశ్వర్ చెరువులో చేపలు పట్టడానికి వెళ్లేవాడని పేర్కొన్నారు. మృతుడికి భార్య రాజ్యలక్ష్మి, ఐదు మంది సంతానం ఉన్నట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed