Crime News : అటవీ భూమిలో భారీగా గంజాయి సాగు

by M.Rajitha |
Crime News : అటవీ భూమిలో భారీగా గంజాయి సాగు
X

దిశ, వెబ్ డెస్క్ : ఎవరికీ అనుమానం రాకూడదు అని గంజాయి స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాలు వెతుకుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏకంగా దట్టమైన అటవీప్రాంతంలో గంజాయి సాగు చేపట్టారు. జిల్లాలోని పెదబయలు మండలంలోని జడిగూడలో ఏకంగా 15 ఎకరాల అటవీ విస్తీర్ణంలో భారీ ఎత్తున గంజాయి మొక్కలు పెంచారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ అమిత్ సూచనలతో రెవెన్యూ అధికారులు, పోలీసులు గంజాయి మొక్కలను పీకివేసి, తగులబెట్టారు. ఈ ఘటనలో పలువురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చే సాయంతో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని, గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement

Next Story