'Writer Padmabhushan' హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్: Shanmukh Prashanth

by Hajipasha |   ( Updated:2023-01-25 12:48:09.0  )
Writer Padmabhushan హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్: Shanmukh Prashanth
X

దిశ, సినిమా: సుహాస్, షణ్ముఖ ప్రశాంత్ కలయికలో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్ 'రైటర్ పద్మభూషణ్‌.శిల్పా రాజ్ హీరోయిన్‌గా నటించిన చిత్రాన్ని ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్‌పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించగా.. జి.మనోహర్ సమర్పిస్తున్నారు. ఫిబ్రవరి 3న విడుదల కానున్న సందర్భంగా షణ్ముఖ ప్రశాంత్ విలేఖరుల సమావేశం నిర్వహించారు. 'సినిమాపై ఆసక్తితోనే విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చాను. సుహాన్‌తో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఇది మన ఇంట్లో జరిగే కథ. హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అందరికీ రిఫ్రెష్‌గా ఉంటుంది. రైటర్ కావాలనుకున్న పద్మభూషణ్ ప్రయాణం ఎలా సాగిందనేది ఆసక్తిని పెంచుతుంది. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ రన్ అవుతుంటుంది. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ఆశిష్ విద్యార్థి, రోహిణి, గోపరాజు రమణ తదితరులు అద్భుతంగా చేశారు' అని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి : Prabhas మూవీలో బాలీవుడ్ హీరో కీ రోల్.. పూనకాలేనంటున్న ఫ్యాన్స్

Advertisement

Next Story

Most Viewed