సమంత ధరించిన ఈ డ్రెస్ ఖరీదెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?

by Hamsa |   ( Updated:2023-08-28 08:22:48.0  )
సమంత ధరించిన ఈ డ్రెస్ ఖరీదెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన ఇండిపెండెన్స్ పరేడ్‌లో పాల్గొని అక్కడ ప్రత్యేకమైన ప్రదేశాల్లో ఎంజాయ్ చేస్తోంది. సమంత, విజయ్ దేవరకొండ కలిసి జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానుంది. అయితే సామ్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఇక ఆదివారం ట్రెండీ లుక్ లో ఉన్న ఫోటోస్ షేర్ చేసింది.

తాజాగా, సమంత వేసుకున్న డ్రెస్ ధర గురించి నెట్టింట చర్చ మొదలైంది. డీప్ V-నెక్‌లైన్‌తో కూడిన ఫ్రంట్-స్లిట్ ఫుల్-స్లీవ్ జాకెట్, జర్దోసీ, రేషమ్, సీక్విన్ ఎంబ్రాయిడరీతో అలంకరించబడిన మ్యాచింగ్ పలాజో ధరించింది. ముత్యాలతో అలంకరించబడిన చోకర్, సొగసైన గొలుసు, స్టడ్ చెవిపోగులు, ఒక జత క్లాస్ గ్లాసెస్‌తో సమంత తన రూపాన్ని మరింత అందంగా మార్చుకుంది.. అయితే ఈ డ్రెస్ ను ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ అనితా డోంగ్రే డిజైన్ చేశారు. దీని ధర రూ. 2,55,000. ఇక సామ్ లేటేస్ట్ డ్రెస్ ధర తెలిసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. కానీ చాలా అందంగా ఉందంటూ సామ్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Read More: ‘ఖుషి’ అడ్వాన్స్ బుకింగ్స్‌కు ఎందుకింత ఆలస్యం?

Advertisement

Next Story