- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mahesh Babu: ఆ కుర్రాళ్లకు సపోర్ట్‌గా మహేష్‌బాబు.. నెట్టింట పోస్ట్ వైరల్!
దిశ, సినిమా: ఒక సినిమా విజయం సాధిస్తే.. ఆ సినిమా నిర్మించిన వారి పలుకుబడి, పరపతితో ఆ మూవీకు బాకా ఊదటానికి రెడీగా ఉంటారు సినీ ప్రముఖులు. అయితే ఇదే ప్రముఖలు చిన్న సినిమా నిర్మించినా పెద్ద స్టార్లు కూడా ఆ సినిమాను భుజాన ఎత్తుకోవడానికి రెడీగా ఉంటారు. అయితే ఎటువంటి నేపథ్యం లేకుండా నిర్మించిన చిన్న సినిమాలు బాగున్నా.. పాపం వాటిని పట్టించుకునే సినీ ప్రముఖుడే దిక్కు వుండడు. ఏదో అదృష్టం బాగుంటే ఒకరో ఇద్దరో ఆ సినిమాను ప్రశంసిస్తూ సోషల్‌మీడియాలో సపోర్ట్ చేస్తుంటారు. అయితే ఒక్కొసారి ఈ స్టార్ హీరోలకు అబ్లిగేషన్స్ వల్ల కొన్ని సినిమాలకు పోస్ట్‌లు చేయాల్సి వస్తుంది. ఇటీవల కాలంలో మేము ఫేమస్ అనే ఓ చిన్న సినిమాకు మహేష్‌బాబు చేసిన పోస్ట్ చాలా విమర్శలకు దారితీసింది. యూట్యూబ్ సినిమాకు ఎక్కువ, టీవీ సీరియల్‌కు తక్కువ అనే రేంజ్‌లో ఉన్న ఆ సినిమాకు మహేష్‌బాబు సోషల్‌మీడియాలో ప్రశంసలు కురిపించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
అయితే మహేష్‌బాబు సన్నిహితులు ఆ సినిమాను నిర్మించడమే ప్రధాన కారణం. ఇక అప్పటి నుంచి మహేష్‌బాబు తన సోషల్‌మీడియా ఖాతాలో ఇలాంటి పోస్టులు పెట్టే విషయంలో చాలా సెలెక్టివ్‌గా వుంటున్నాడు. కాగా నటుడు, నిర్మాత నాగబాబు కూతురు కొణిదెల నిహారిక నిర్మించిన చిత్రం 'కమిటీ కుర్రాళ్లు'. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కొన్ని వర్గాల వారికి ముఖ్యంగా యూత్‌కు ఈ సినిమా నచ్చుతుందని చెబుతున్నారు చిత్ర యూనిట్. అంతా కొత్తవాళ్లతో తెరకెక్కిన ఈ చిత్రంలో స్నేహం, రాజకీయాలు, జాతర ఇలా అన్ని మిక్స్ చేసి ఓ ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే చాలా కాలం విరామం తరువాత మహేష్‌బాబు ఈ సినిమాకు వస్తున్న స్పందనపై తన ఎక్స్ అకౌంట్‌లో స్పందించాడు. ఈ సినిమా గురించి గొప్పగా వింటున్నానని, చిత్ర యూనిట్‌కు తన అభినందనలు తెలియజేస్తూ త్వరలోనే ఈ సినిమాను చూస్తానని మహేష్ తన సోషల్‌మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు.
Read More..
Committee Kurrallu: నిహారిక నిర్మాతగా సక్సెస్ అయిందా.. ‘కమిటీ కుర్రాళ్ల’పై నెట్టింట టాక్ ఇదే!