‘సింహాద్రి’ రీరిలీజ్ భారీ నష్టాలను మిగల్చనుందా.?

by sudharani |   ( Updated:2023-05-20 12:18:10.0  )
‘సింహాద్రి’ రీరిలీజ్ భారీ నష్టాలను మిగల్చనుందా.?
X

దిశ, సినిమా: నేడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘సింహాద్రి’ చిత్రాన్ని గ్రాండ్‌గా రీరిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు రీరిలీజ్ అయిన మూవీస్‌లో మార్నింగ్ షో హౌస్ ఫుల్ అయిపోయాయి. పవన్ కళ్యాణ్ ‘జల్సా’, ‘ఖుషి’ చిత్రాల తర్వాత ఈ చిత్రానికే అలా జరిగింది. కాగా మార్నింగ్ షో హౌస్ ఫుల్ అయినా.. ఆ తర్వాత షోస్ వసూళ్లు బాగా డౌన్ అయ్యాయి.

అయితే ఈ మూవీ రీరిలీజ్‌కు నెల రోజుల ముందుగానే ప్రచార కార్యక్రమాలు మొదలెట్టి.. పది రోజుల ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించి, ప్రీరిలీజ్ ఈవెంట్‌కు సెలబ్రిటీస్‌ను ఆహ్వానించి గ్రాండ్‌గా నిర్వహించారు. ఇక ఇందుకోసం మొత్తం రూ.5 కోట్ల వరకు ఖర్చయినట్లు సమాచారం. కాగా ఈ మూవీ గ్రాస్ వసూళ్లు రూ.4కోట్ల కంటే తక్కువ ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం. అదే కనుక జరిగితే ఖర్చు చేసి నష్టాలను కొని తెచ్చుకున్న ఏకైక రీరిలీజ్ సినిమాగా ‘సింహాద్రి’ మిగిలిపోతుంది.

Read More: బాలయ్యతో నేను సాంగ్ చేయడమేంటి?.. ఫైర్ అయిన మిల్కీ బ్యూటీ..

Machilipatnam: జూ.ఎన్టీఆర్ కటౌట్‌కు మేకపోతుల బలి

సింహాద్రి సినిమా రీ రిలీజ్.. థియోటర్లో రమా రాజమౌళి హంగామా..! (వీడియో)

Advertisement

Next Story