- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరుణ్-లావణ్య పెళ్లికి పవన్ కల్యాణ్ వస్తాడా.. ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్‌లోనూ ఉత్కంఠ!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి వార్తలే కనిపిస్తున్నాయి. ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట నవంబరు 1వ తేదీన ఏడడుగులు వేయబోతున్నారు. వీరి పెళ్లి ఇటలీలోని టుస్కానీ నగరంలో గ్రాండ్‌గా జరగబోతోంది. ఈ వివాహానికి మెగా, అల్లు, లావణ్య కుటుంబ సభ్యులు మాత్రమే హాజరుకానున్నారు. అయితే, ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇతర హీరోలందరూ తమ షూటింగ్స్‌కు బ్రేక్ చెప్పేశారని టాక్. అయితే పవన్ కల్యాణ్ ఓ వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
నవంబరు నెలాఖరులో ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అన్నీ వదులుకొని పవన్ ఇటలీకి వెళ్లి కొత్త జంటని ఆశీర్వదిస్తాడా? లేదా? అని మెగా ఫ్యాన్స్‌లో సందేహం నెలకొంది. పవన్ పెళ్లికి వెళ్లి వరుణ్-లావణ్యను ఆశీర్వదించి వెంటనే వచ్చేస్తాడని మరికొంతమంది చర్చించుకుంటున్నారు. కాగా, ఇటలీలో మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకకు పవర్ స్టార్ హాజరు అవుతారో లేదో వేచి చూడాల్సిందే.