రూ. 100 కోట్లు ఇచ్చిన అలాంటి సినిమాల్లో నటించనని చెప్పేసిన శ్రీలీల..?

by sudharani |   ( Updated:2023-07-28 15:20:58.0  )
రూ. 100 కోట్లు ఇచ్చిన అలాంటి సినిమాల్లో నటించనని చెప్పేసిన శ్రీలీల..?
X

దిశ, వెబ్‌డెస్క్: ‘పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శ్రీలీల. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ప్రతి కుర్ర హీరో, స్టార్ హీరోలు సైతం ఈ బ్యూటీనే హీరోయిన్‌గా తీసుకోవాలి అనుకుంటున్నారట. ఈ క్రమంలోనే అమ్మడుకి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా శ్రీలీల ఓ బెస్ట్ ఆఫర్‌ను వదులుకుందట. అదేంటంటే..

శ్రీలీల దగ్గరకు ఓ స్టార్ డైరెక్టర్ బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాను తీసుకెళ్లారట. ఈ సినిమలో నటిస్తే రూ. 10 కోట్ల పారితోషకాన్ని ఇస్తామని చెప్పారట. కానీ, ఆ ప్రాజెక్ట్ శ్రీలీల నిర్మొహమాటంగా నో చెప్పిందని టాక్. అంతే కాకుండా రూ. 10 కోట్లు కాదు రూ. 100 కోట్లు ఇచ్చిన అలాంటి బోల్డ్ కంటెంట్ సినిమాలు చేయను అంటూ తెగేసి చెప్పేసిందట ఈ బ్యూటీ. బోల్డ్ కంటెంట్ చెయ్యాలి అనుకోవడం లేదు. ఒకవేళ చెయాల్సి వస్తే సినిమాలకు గుడ్‌బై చెప్పేస్తాను అని తెలిపిందట.

దీంతో పాటు పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ సినిమాకు సైతం ఈ అమ్మడు నో చెప్పిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ‘పుష్ప-2’ ఐటెమ్ సాంగ్ చేసేందుకు శ్రీలీలకు ఆఫర్ వస్తే.. తను అప్పుడే ఐటెమ్ సాంగ్‌లో నటించాలని అనుకోవడం లేదని సున్నితంగా తిరస్కరించిందట. అయితే.. ఈ వార్తల్లో నిజం ఎంత వరకు ఉందో తెలియదు కానీ నెట్టింట్ హాట్ హాట్‌గా వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story