బాలయ్య వస్తేనే అమ్మాయితో ఆ తంతు మొదలు పెడతా.. మూడేళ్లుగా ఓ వీరభిమాని వెయిటింగ్ !

by sudharani |   ( Updated:2023-03-10 15:21:02.0  )
బాలయ్య వస్తేనే అమ్మాయితో ఆ తంతు మొదలు పెడతా.. మూడేళ్లుగా ఓ వీరభిమాని వెయిటింగ్ !
X

దిశ, వెబ్‌డెస్క్: సినిమా హీరోలకు అభిమానులు ఉండటం కొత్తేమి కాదు. తమ అభిమాన హీరో కోసం వారు ఏం చేయడానికైనా వెనుకాడరు. ఇక తమ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయిందంటే చాలు.. థియేటర్లలో సందడి వాతావరణాన్ని తీసుకొస్తారు అభిమానులు. తమ అభిమాన హీరో విషయంలో ఎవరైనా తప్పుగా మాట్లాడితే కొట్లాటలకు సైతం దిగుతారు. ఈ క్రమంలోనే కొంత మంది ప్రాణాలు పొగుట్టుకునే వరుకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. కానీ.. కొంత మంది అభిమానులు తమ హీరో కోసం చేసే పనులు విచిత్రంగా అనిపిస్తాయి. తాజాగా ఇదే విధంగా చేశాడు బాలయ్య వీర అభిమాని. ఇంతకీ అతడు ఏం చేశాడంటే..

విశాఖపట్నం పెందుర్తి‌కి చెందిన కోమలి పెద్దినాయుడు అనే వ్యక్తి నందమూరి బాలకృష్ణకు వీరభిమాని. అయితే కోమలి పెద్ది నాయుడుకి 2019 లో గౌతమి ప్రియ అనే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ జరిగింది. తన పెళ్లికి బాలయ్య రావాలని వైజాగ్ ఫ్యాన్స్ అసోషియేషన్ ద్వారా బాలయ్యకు ఆహ్వానం అందించాడు. అయితే అప్పుడు ఖాళీ లేకపోవడంతో బాలయ్య వెళ్లలేకపోయాడట. ఆ తర్వాత కరోనా, లాక్ డౌన్ వల్ల బాలయ్య వచ్చే అవకాశం లేకపోవడంతో అప్పుడు పెళ్లిని ఆపారట. ఇక అప్పటి నుంచి పెద్ది నాయుడు బాలయ్య వస్తేనే తాళి కడతానని అభిమాన హీరో రాకకోసం 3 ఏళ్లు నుంచి భీష్మించుకుని కూర్చున్నాడట. ఈ మధ్య కాలంలో కూడా రెండు, మూడు సార్లు ముహూర్తం పెట్టించినప్పటికీ బాలకృష్ణ రాలేకపోయాడని తెలుస్తోంది.

ఇక తాజాగా.. ఈ నెల 11న మరోసారి పెళ్లి ముహూర్తం కుదుర్చుకున్నాడు పెద్దినాయుడు. అంతే కాదు ఈ సారి తప్పకుండా వస్తానని బాలయ్య హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. ఇన్నాళ్లు పెళ్లి ఎలా వాయిదా వేశావు. అమ్మాయి తరుపు బంధువులు ప్రెజర్ పెట్టలేదా అని ఆ అభిమానిని ప్రశ్నించగా.. నాతో పాటు నా భార్య.. మా చుట్టాలు.. మా ఊరివారు అందరూ బాలయ్యకు వీర అభిమానులే. అందుకే ఇదంతా సాధ్యం అయింది. అంతే కాదు రేపు బాలయ్య బాబుకు వెల్కం చెప్పడానికి ఊరు ఊరంతా సిద్ధంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు పెళ్లికొడుకు.

Also Read..

ఆ హీరోయిన్‌తో కిరణ్ అబ్బవరం డేటింగ్‌‌..? ఫొటోలు వైరల్

Advertisement

Next Story