Devara: విశ్వక్, సిద్దూతో ‘దేవర’ స్పెషల్ ఇంటర్వ్యూ.. సినిమా రేంజ్ ను పెంచనుందా?

by Prasanna |
Devara: విశ్వక్, సిద్దూతో ‘దేవర’ స్పెషల్ ఇంటర్వ్యూ.. సినిమా రేంజ్ ను పెంచనుందా?
X

దిశ, వెబ్ డెస్క్ : కొరటాల శివ డైరెక్షన్లో హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర. ఈ సినిమా కోసం కేవలం అభిమానులు కాకూండా సినీ ఇండస్ట్రీ మొత్తం వేచి చూస్తున్నారు. మొన్న రిలీజ్ అయినా ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ రావడంతో అప్పటి వరకు అంచనాలు కాస్తా అమాంతం పెరిగిపోయాయి. ఆచార్యతో ఫ్లాప్ అందుకున్న డైరెక్టర్ ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టి మళ్లీ తన సక్సెస్ ట్రాక్ లోకి వెళ్ళాలని చాలా కష్టపడి తెరకెక్కించాడు. దేవర మూవీ దేశ వ్యాప్తంగా ఈ నెల 27 న థియేటర్లోకి రానుంది.

ప్రస్తుతం ఈ మూవీలో నటించిన వారందరూ ప్రమోషన్లలో ఫుల్ బిజీ అయ్యారు. ఇక సినిమాలో నటించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితే గ్యాప్ లేకుండా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నుంచి సోలోగా వస్తున్న మూవీ అవ్వడంతో దేవర కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.

తారక్ వరుస ఇంటర్వ్యూలలో బిజీ అవుతూ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచాడు. ఈ క్రమంలోనే తారక్ కి దగ్గరగా ఉండే సన్నిహితులు హీరో సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ లు స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. వీరిద్దరూ ఫుల్ మాస్ .. ఇక వీరు చేసిన ఇంటర్వ్యూ సినిమా రేంజ్ ని పెంచే విధంగా ఉంటుందని సినీ వర్గాల వారు అంటున్నారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మరి, తారక్ ను ఎలాంటి ప్రశ్నలు అడిగారో తెలియాలంటే రెండు, మూడు రోజులు ఆగాల్సిందే!

Advertisement

Next Story

Most Viewed