బ్రహ్మానందంను దర్శకులంతా ఎందుకు పక్కన పెట్టేస్తున్నారు..

by Anjali |   ( Updated:2023-06-30 08:58:43.0  )
బ్రహ్మానందంను దర్శకులంతా ఎందుకు పక్కన పెట్టేస్తున్నారు..
X

దిశ, సినిమా: హాస్య నటుడు బ్రహ్మానందం గురించి పరిచయం అక్కర్లేదు. వెయ్యికి పైగా సినిమాల్లో నటించి గొప్ప గుర్తింపు సంపాదించుకున్న ఆయన లేకుండా సినిమా లేదు అనే టాక్ వచ్చేలా చేశాడు. సెపరేట్‌గా ఆయన కోసం కామెడీ ట్రాక్స్ రాసిన దర్శకులు కూడా ఉన్నారు. బ్రహ్మీ డేట్ల కోసం మూవీస్ వాయిదా పడ్డ సందర్భాలూ ఉన్నాయి. అలాంటి అద్భుతమైన నటుడిని ఈ తరం దర్శకులు పట్టించుకోవడం లేదనేది సత్యం.

ఆయన కామెడీ అంటే పడిచచ్చే అభిమానులు కోట్లల్లో ఉన్నప్పుడు.. బ్రహ్మీతో సినిమా చేయడం కచ్చితంగా సినిమాకు ప్లస్ అవుతుందని యంగ్ డైరెక్టర్స్‌కు సూచిస్తున్నారు పలువురు ఫ్యాన్స్, విశ్లేషకులు. ఇప్పుడు కనుక బ్రహ్మీతో మూవీ వస్తే మాత్రం సూపర్ హిట్ అవ్వడం ఖాయం. మొత్తానికి ఈ విషయాన్ని ముందుగానే గుర్తించిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్.. ‘కీడ కోలా’తో ఆయనను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ఈ చిత్రంలో కీ రోల్ ప్లే చేస్తున్న బ్రహ్మీ కామెడీని చూసి ఇక హాయిగా నవ్వుకోండి. కనీసం తరుణ్‌ భాస్కర్‌ను చూసైనా మిగతా దర్శకులు ప్రేరణ పొందుతారేమో చూద్దాం.

Advertisement

Next Story