‘గాంజా శంక‌ర్’కు సరిజోడీ ఎవ‌రు..?

by Shiva |   ( Updated:2023-06-20 09:33:11.0  )
‘గాంజా శంక‌ర్’కు సరిజోడీ ఎవ‌రు..?
X

దిశ, వెబ్ డెస్క్ : మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్, దర్శుకుడు సంపత్ నంది కాంబినేషన్ లో వస్తున్న మూవీకి ‘గాంజా శంక‌ర్‌’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. జులై మొదటి వారంలో షూటింగ్ పట్టాలెక్కనుంది. అయితే.. సాయిధరమ్ కు జోడీగా ఓ క‌థానాయిక వెతికేందుకు మెకర్స్ ప్రయత్నాలు ప్రారంభించారు. దర్శకుడు సంప‌త్ నంది సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు మంచి ప్రాధాన్యత కూడా ఉంటుందని టాక్. ‘గాంజా శంక‌ర్’కి తోడుగా శ్రీ‌లీల లేని పక్షంలో పూజా హెగ్డేని తీసుకునే అవకాశం ఉంది. ఇరువురికి కథను కూడా వినిపించారని, ఇక వారే ఫైన‌ల్ కాల్ తీసుకోవాల్సి ఉందని సమాచారం. ఇద్దరిలో ఒకరి డేట్లు చిత్రానికి సద్దుబాటు అయితే.. వారితో సాయిధరమ్ తేజ్ జతకట్టనున్నాడు. ప్రస్తుతానికైతే శ్రీ‌లీల‌, పూజా ఇద్దరూ ఫుల్ బిజీ. శ్రీ‌లీల‌తో పోలిస్తే పూజా డేట్లే కాస్త అందుబాటులో ఉంటాయేమో. మ‌రి వీరిద్దరిలో కథానాయికగా ఎవ‌రు ఫైన‌ల్ అవుతారో ఇక వేచి చూడాల్సిందే. .

Also Read..

రామ్ చరణ్-ఉపాసన ప్రిన్సెస్‌కు కలిసొస్తున్న లక్కీ సెంటిమెంట్ ఇదే!

Advertisement

Next Story

Most Viewed