- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘వ్యూహం’లో సీఎం జగన్ భార్యగా నటించిన ఆమె ఎవరు..! తన బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?
దిశ, వెబ్‌డెస్క్: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘వ్యూహం’. రాజకీయ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే.. జగన్ క్యారెక్టర్, ఆయన వైఫ్ పాత్ర ఫొటోలు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా.. చిరంజీవి, పవన్ కల్యాణ్ పాత్రల ఫొటోలు కూడా రిలీజ్ చేసి సంచలనం సృష్టిస్తున్నాడు రాం గోపాల్ వర్మ. ఎలక్షన్ దగ్గర పడుతున్న సమయంలో ఈ సినిమాలోని పాత్రలను రిలీజ్ చేయడంతో ఇవి ఎంత వరకు దారి తీస్తాయో అని ప్రజల్లో ఇప్పటికే ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో సీఎం జగన్ భార్య భారతి పాత్ర చేస్తున్న నటి ఎవరు.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? అని గూగుల్‌లో తెగ సెర్చ్ చేసే పనిలో పడ్డారు నెటిజన్లు. మరి ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం.
జగన్ సతీమణి భారతి పాత్రలో నటించిన హీరోయిన్ పేరు మానస రాధాకృష్ణన్. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ నటించిన హైవే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఈమె బాల నటిగా మలయాళంలో ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలు చేసింది. ఇక.. రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ సినిమాతో టాలీవుడ్‌లో మరోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా హిట్ అయితే.. ఇండస్ట్రీలో ఈ అమ్మడుకి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు నెటిజన్లు. చూడాలి మరి.. ఈ సినిమాతో అమ్మడు ఫేమ్ మారుతుందేమో.