NAGABABU: నాగబాబుకు చిరంజీవి- పవన్‌ కళ్యాణ్.. ఎవరంటే ఇష్టం? నెట్టింట వివాదానికి దారి తీస్తోన్న ఫొటో

by Anjali |   ( Updated:2024-08-14 09:53:36.0  )
NAGABABU: నాగబాబుకు చిరంజీవి- పవన్‌ కళ్యాణ్.. ఎవరంటే ఇష్టం? నెట్టింట వివాదానికి దారి తీస్తోన్న ఫొటో
X

దిశ, సినిమా: మెగా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. మెగా కుటుంబీకుల అనుబంధం ఎంత చక్కనైందో కూడా మనం స్పెషల్‌గా చెప్పుకోనవసరం లేదు. ముందుగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన నటన, డాన్స్‌తో కోట్లాది మంది అభిమానుల్ని సొంత చేసుకున్నాడు. తర్వాత తన బ్రదర్స్ నాగబాబు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను సినీ పరిశ్రమకు అండ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. చిరు కారణంగా నేడు మేం ఈ స్థాయిలో ఉన్నామని నాగబాబు అండ్ పవన్ కల్యాణ్ పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే.. ఇటీవల నాగబాబు లాంఛ్ చేసిన ఎన్ ఛానల్ న్యూ ఆఫీసులో తమ్ముడు డిప్యూటీ సీఎ పవన్ కల్యాణ్ ఫొటో పెట్టుకున్నారట.

పవర్ స్టార్ ఫ్యాన్ స్కెచ్‌తో వేసిన ఆ ఫొటోను నాగబాబు ఆయన ఎన్ ఆఫీసు గొడకు తగిలించారట. ఇది కాస్త సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారీ తీసింది. మెగా ఫ్యామిలీ అనే మహావృక్షం నాటిన మెగాస్టార్ ఫొటోనే లేదు. పవన్ కల్యాణ్ ఫొటో ఉంటే మాకేం అభ్యంతరం లేదు కానీ చిరు ఫొటో పెట్టుకోకుండా కేవలం పవన్ అన్న ఫొటోనే పెట్టుకోవడం మాకు కాస్త బాధగా ఉందని అభిమానులు నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. కానీ నాగబాబుకు మెగాస్టార్ చిరంజీవి-పవన్ కల్యాణ్ ఇద్దరు సమానమే, ఇద్దరంటే ఎక్కువగా ఇష్టమే అంటూ వాదిస్తున్నారు.

Read More..

Pawan Kalyan:‘నా అభిమాని వారే’ ఇన్నాళ్లకు సంచలన పేరు రివీల్ చేసిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్

Advertisement

Next Story