మలయాళ నటుడిపై లైంగిక కేసు.. షాక్ ఇచ్చిన హైకోర్టు

by Hamsa |   ( Updated:2023-05-25 07:49:45.0  )
మలయాళ నటుడిపై లైంగిక కేసు.. షాక్ ఇచ్చిన హైకోర్టు
X

దిశ, సినిమా: ఇటీవల ‘మాలికాపురం’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ గత కొద్ది రోజులుగా లైంగిక వేధింపుల కేసులో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. 2017 లో ఆగస్టు 23న బాధితురాలు సినిమా ప్రాజెక్టు గురించి చర్చించేందుకు తన నివాసానికి వచ్చినందుకు ముకుందన్ తనపై దాడికి పాల్పడ్డారని సెప్టెంబర్ 15, 2017లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆమె ఆరోపణలను ఉన్ని ముకుందన్ ఖండించారు. ఆమె పై పరువు నష్టం దావా దాఖలు చేసి, ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా, ఉన్ని ముకుందన్‌కు హైకోర్టు ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. తన పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఈ కేసు పై ఫిబ్రవరి 2023లో విధించిన స్టేను, తాజాగా కేరళ హైకోర్టు ఎత్తివేసింది. దీంతో తనను కోర్టు నిర్దోషిగా ప్రకటిస్తుందన్న ముకుందన్‌ ఆశలు అవిరయ్యాయి.

Read more:

Jinal Joshi hot Pictures:బాత్ టబ్‌లో న్యూడ్ షో.. కన్నుకొట్టి కవ్విస్తున్న జినాల్

Advertisement

Next Story