Social Media లో ఆ నటిని వేధించిన Ananya Panday.. తప్పు ఒప్పుకుంది..

by Anjali |   ( Updated:2023-08-25 16:19:05.0  )
Social Media లో ఆ నటిని వేధించిన Ananya Panday.. తప్పు ఒప్పుకుంది..
X

దిశ, సినిమా : సోషల్ మీడియాలో స్టాకింగ్ అంటే తనకు ఇష్టమంటోంది యంగ్ బ్యూటీ అనన్యా పాండే. అయితే ఇదే తన తాజా చిత్రం ‘డ్రీమ్ గర్ల్ 2’ లో నేచురల్‌గా యాక్ట్ చేసేందుకు హెల్ప్ చేసిందని చెప్పింది. రీసెంట్ ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన విషయాలు చెప్పుకొచ్చింది. ‘నాకు స్టాకర్‌కి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి. అందరి గురించి అన్నీ తెలుసుకోవాలని ఆరాటపడుతా. ఈ గుణం నాకు నటనలో కూడా సహాయపడుతుంది. ‘డ్రీమ్ గర్ల్ 2’ షూటింగ్ కోసం మధురకు వెళ్లినప్పుడు.. చుట్టుపక్కల ఉన్న వ్యక్తులను, వారు మాట్లాడే తీరును శ్రద్ధగా గమనించాను. అవన్నీ నా క్యారెక్టర్‌లో ఉపయోగించాను. జీనత్ అమన్.. నేను ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి. ఆమె పోస్ట్‌లు, రైటింగ్స్ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఆమె ఒక సినిమా సెట్స్ నుంచి త్రోబాక్ ఫొటోస్ షేర్ చేస్తే, కచ్చితంగా చూస్తాను’ అని తెలిపింది.

ఇవి కూడా చదవండి : ఖుషి చిత్రం నుంచి ‘పెళ్లామా’ సాంగ్ ప్రోమో విడుదల..!

Advertisement

Next Story