Mega daughter:నిహారిక సినిమాల్లో నటించకముందు ఎక్కడ పనిచేసింది?ఫస్ట్ జీతం ఎంత? రివీల్ చేసిన మెగా డాటర్

by Anjali |   ( Updated:2024-08-17 08:35:15.0  )
Mega daughter:నిహారిక సినిమాల్లో నటించకముందు ఎక్కడ పనిచేసింది?ఫస్ట్ జీతం ఎంత? రివీల్ చేసిన మెగా డాటర్
X

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక ఇటీవలే ఏకంగా పదకొండు మంది కొత్త హీరోలతో ‘కమిటీ కుర్రాళ్లు’ అనే సినిమాను నిర్మించింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆగస్టు 9 వ తారీకున థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఊహించని రేంజ్‌లో భారీ కలెక్షన్లు కొల్లగొడుతోంది. దీంతో మెగా ఫ్యామిలీ అండ్ మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమా రిలీజ్ కు ముందే ‘మా నిహారిక నిర్మించిన కమిటీ కుర్రాళ్లు సినిమా అందరూ వీక్షించండి. నేను చూశాను. స్టోరీ చాలా బాగుంది. ఈ చిత్రంలో నటించిన నటీనటులకు అవార్డులు రివార్డులు రావాలని కోరుకుంటున్నానని’ ముందే చిరు.. డాటర్ నిహారిక మూవీ రివ్యూ చెప్పిన విషయం తెలిసిందే.

అయితే ఈ మూవీ విడుదలకు ముందు ప్రమోషన్స్ లో నిహారిక సినిమాల విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాల గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మెగా డాటర్ తెలిపిన ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిహారిక సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు ఏం చేసింది? తండ్రి ఎలా చూసుకునేవారు, ఏం వర్క్ చేసింది? అనే విషయాలు వెల్లడించింది. కాగా మెగా డాటర్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వకముందు హైదాబాదులోని ఓ కేఫ్ లో వర్క్ చేసిందని చెప్పుకొచ్చింది. ఆ కేఫ్ లో వారు వీక్లీ వెయ్యి రూపాయలు ఇచ్చారని పేర్కొంది. అలాగే నాగబాబుకు తనంటే చాలా ఇష్టమని, ఎక్కడికి పంపించేవారు కాదని.. దీంతో హైదరాబాదులోనే చదివానని, ఇక్కడే పని చేశానని మెగా డాటర్ నిహారిక వెల్లడించింది.

Advertisement

Next Story