- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫైనల్‌గా ఓటీటీలోకి ‘ది కేరళ స్టోరీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నో వివాదాల మధ్య రిలీజైన సినిమా ‘ది కేరళ స్టోరీ’. సుదీప్తో సేన్ దర్శకత్వంలో వహించిన ఈ మూవీ.. లవ్ జిహాద్ నేపథ్యంలో వచ్చి అనేక వివాదాలు సృష్టించింది. కానీ, కలెక్షన్లు మాత్రం భారీగా రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే.. ఏ కొత్త సినిమా వచ్చిన దాదాపు ఒక నెలలో ఓటీటీలోకి దర్శనమిస్తుంది. కానీ.. ‘ది కేరళ స్టోరీ’ రిలీజై రెండు నెలలు గడుస్తున్నప్పటికీ ఓటీటీలోకి రాలేదు. దీనికో బలమైన కారణం ఉందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.
‘ది కేరళ స్టోరీ’ డిజిటల్, శాటిలైట్ హక్కులను విక్రయించడానికి నిర్మాతలు భారీ మొత్తాన్ని డిమాండ్ చేశారట. అంతే కాకుండా నిర్మాత విపుల్ షా ‘ది కేరళ స్టోరీ’ సినిమాను విక్రయించేందుకు ఏకంగా రూ. 75 నుంచి రూ. 100 కోట్లు డిమాండ్ చేసినట్లు టాక్. దీంతో ఈ సినిమాను కొనేందుకు ఓటీటీ ప్లాట్ ఫారమ్‌లు ముందుకు రాలేదు. ఈ క్రమంలోనే ఓటీటీ లవర్స్‌కు ఈ సినిమా కాస్త నిరాశపరిచినట్లుయింది. అయితే.. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు.. ‘ది కేరళ స్టోరీ’ ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ Zee5 తీసుకుందని నెట్టంట టాక్ వినిపిస్తుంది. అంతే కాకుండా ఈ నెలాఖరు నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్ల సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా.. ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.