ఆ ఆనందం తట్టుకోలేక ‘బ్రా’ విప్పేసిన మహిళా.. తర్వాత ఏం జరిగిందంటే

by sudharani |
ఆ ఆనందం తట్టుకోలేక ‘బ్రా’ విప్పేసిన మహిళా.. తర్వాత ఏం జరిగిందంటే
X

దిశ, సినిమా : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, తన భర్త నిక్ జోనాస్‌కు ఊహించని సంఘటన ఎదురైంది. ఓ కచేరిలో భాగంగా మహిళా అభిమాని చేసిన పనికి ప్రియాంక స్పందించిన తీరు కూడా హాస్యాస్పదంగా మారింది. విషయానికొస్తే.. 2019 యుఎస్‌లో జరిగిన జోనాస్ బ్రదర్స్ కచేరీ ఈవెంట్‌కు నిక్ జోనాస్ తల్లిదండ్రులతో పాటు ప్రియాంక కూడా హాజరైంది.

అయితే కచేరీ ముగిసిన తర్వాత భర్తతో కలిసి వేదిక నుంచి బయటికు వెళ్తున్నపుడు ఓ మహిళా అభిమాని ఆనందం తట్టుకోలేక తన బ్రా తీసి నిక్‌పై విసిరింది. వెంటనే విషయాన్ని గమనించిన ప్రియాంక నేలపై పడిపోయిన ఆ తెల్లటి బ్రాను పెకెత్తి అందరికీ చూపించింది. అంతేకాదు దాన్ని తన భుజాలపై వేసుకుని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోవడం విశేషం. కాగా ప్రస్తుతం ఈ వీడియో మరోసారి వైరల్ అవుతుండగా నెటిజన్లు భిన్న కామెంట్లతో ఆడేసుకుంటున్నారు.

Advertisement

Next Story