అవ్వా.. తమన్నాకు కోపం వస్తే అలా చేస్తుందా? షాకవుతోన్న నెటిజన్లు!

by Anjali |   ( Updated:2024-03-05 12:02:21.0  )
అవ్వా.. తమన్నాకు కోపం వస్తే అలా చేస్తుందా? షాకవుతోన్న నెటిజన్లు!
X

దిశ, సినిమా: హీరోయిన్ తమన్నా భాటియా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. కాబట్టి ఈ అమ్మడుకు ఇండస్ట్రీలో తిరుగేలేకుండా పోయింది. అప్పట్లో టాలీవుడ్ ‌ను ఓ ఊపు ఊపిందనడంతో అతిశయోక్తిలేదు. ప్రస్తుతం కూడా టాప్ హీరోయిన్ గా దూసుకుపోతూ.. మంచి సక్సెస్ ను అందుకుంటుంది. తెలుగులో ఈ బ్యూటీకి కాస్త మూవీ అవకాశాలు తగ్గినప్పటికీ హిందీ, తమిళ్, సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది.

అంతేకాకుండా వెబ్ సిరీస్‌లు కూడా వదలకుండా నటిస్తుంది. ఏ అవకాశాలన్ని మిస్ చేసుకోకుండా చివరకు బోల్డ్ సీన్లలో నటిస్తూ తన సత్తా ఎంటో చాటుతుంది. ఇకపోతే తాజాగా ఈ మిల్క్ బ్యూటీ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. అయితే తమన్నా బయటెక్కడ కనిపించినా చాలా కూల్ గా కనిపిస్తారు కదా.. కానీ తమన్నాకు కోపం చాలా ఎక్కువట. ఈమెతో ట్రావెల్ చేస్తున్నవారికి ఆమె కోపం గురించి ఎక్కువగా తెలుస్తుందట. ఆ సమయంలో తమన్నా ఇతరుల మీద ఎక్కువగా చూపిస్తుందని టాక్.

చుట్టుపక్కల వారు భయపడేంతగా తన కోపాన్ని ఇతరుల పై ప్రదర్శిస్తుందట. కొన్నిసార్లు విపరీతంగా కోపం వచ్చినప్పుడు రూమ్ లోకి వెళ్లి.. డోర్స్ వేసుకుని ఒంటరిగా కూర్చుందట. డోర్ తీయమని ఎంత పిలిచినా అస్సలు పలకదట. తమన్నా కోపం అంతా పోయేవరకు బయటకు రాదట. కోపం చల్లారిన తర్వాత కూల్ వాటర్‌తో ఫేస్ కడుక్కుని బయటకు వస్తుందట. తర్వాత తన సమస్య ఏంటి? తనకు ఎందుకు కోపం వచ్చిందనే విషయాన్ని ఇతరులతో పంచుకుంటుందట. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ న్యూస్ విన్న నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు.

Read More..

ఆ స్టార్ హీరోతో కమిటైన త్రిష.. ఆ ఒక్కపని చేసినందుకు ఏకంగా రూ. 5 కోట్లు తీసుకుందా?

Advertisement

Next Story