బ్రహ్మముడిలో రుద్రాణి పాత్రకు పారితోషికం ఎంతంటే..షర్మిత గౌడ రోజుకు అంత తీసుకుంటుందా?

by Kavitha |   ( Updated:2024-05-01 10:26:57.0  )
బ్రహ్మముడిలో రుద్రాణి పాత్రకు పారితోషికం ఎంతంటే..షర్మిత గౌడ రోజుకు అంత తీసుకుంటుందా?
X

దిశ,సినిమా: స్టార్ మా‌లో ప్రసారమయ్యే ధారావాహికల్లో ‘బ్రహ్మముడి’ ఒకటి. ఈ సీరియల్ తక్కువ సమయంలో ఎక్కువ ప్రేక్షకాదరణ పొందింది. ఈ సీరియల్‌లో మానస్ నాగులపల్లి హీరోగా, దీపిక రంగనాథ్ హీరోయిన్‌గా కీలక పాత్రలను పోషిస్తున్నారు.

అయితే ఈ సీరియల్‌లో ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకొంటున్న పాత్రల్లో షర్మితా గౌడ్ అలరిస్తున్న ‘రుద్రాణి’ పాత్ర ఒకటి. ఆమె కన్నడ కు చెందిన నటి, మోడల్. జానకి రాఘవ సీరియల్ ద్వారా 2017లో కన్నడ టెలివిజన్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అనతికాలంలోనే మంచి నటిగా గుర్తింపు పొందారు.ఇక బ్రహ్మముడి సీరియల్ ద్వారా ఆ పాపులారిటీ రెండింతలు అయింది.

అయితే ఈ సీరియల్‌లో స్ట్రాంగ్ క్యారెక్టర్‌ను ప్లే చేస్తున్న రుద్రాణికి భారీ రెమ్యునరేషన్ ఇచ్చారని తెలిసింది. టెలివిజన్ ఇండస్ట్రీ వర్గాలు తెలియజేసిన ప్రకారం.. ప్రతి రోజు ఆమెకు 15 వేల రూపాయలు చొప్పున అంటే ఇలా నెలకు దాదాపు 25 రోజులు సీరియల్స్‌లో నటిస్తూ.. సుమారుగా 5 లక్షల వరకు సంపాదిస్తున్నట్టు తెలిసింది.

Read more : బ్రహ్మముడి కావ్య రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్.. రోజుకి అంత తీసుకుంటుందా!

Advertisement

Next Story