- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PRABHAS: ప్రభాస్ సంపాదించిన డబ్బంతా ఏం చేస్తున్నాడు.. ఇన్నాళ్లకు బయటపడ్డ అసలు నిజం?
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవలే ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంలో దిశా పటానీ, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూల్ వంటి అగ్ర నటులు నటించి.. తమ నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు.
ఇక ప్రభాస్ నటిస్తోన్న ‘రాజా సాబ్’ చిత్రం నుంచి జులై 29 వ తేదీన ‘ఫ్యాన్స్ ఇండియా గ్లింప్స్’ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ రెబల్ ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ప్రభాస్ బైక్ దిగి.. నడుచుకుంటూ వస్తూ పూల గుచ్ఛం చేతిలో పట్టుకుని వింటేజ్ లుక్‌లో అదిపోయారు. కారు అద్దంలో తనను తాను చూసుకుంటూ ఫ్లవర్స్ చల్లుతోన్న విజువల్స్ అభిమానుల్ని మరింతగా ఆకట్టుకున్నాయి. ఈ గ్లింప్స్ రిలీజైన కొన్ని గంటల్లోనే భారీగా వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం.
ఇకపోతే ప్రభాస్ పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు చేస్తూ గత రెండేళ్లుగా ఒక్కో సినిమాకు దాదాపు 100 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నారు. మరీ ఈ డబ్బు అంతా రెబల్ స్టార్ ఏం చేస్తుంటాడబ్బా అని చాలా మందిలో సందేహాలు తలెత్తే ఉంటాయి. కాగా ప్రభాస్ ఆ డబ్బును ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కోసం ఖర్చు పెడుతారట. అలాగే రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులుగా పెడుతున్నారని టాక్. ఇటీవలే రెబల్ స్టార్ ఇటలీలో ఓ ఖరీదైన ఇల్లు కొన్నాడట. ముంబైలో కొన్ని ఫ్లాట్లు కొన్నారట. హైదరాబాదు శివార్లలో ఫామ్ హౌస్ లు కట్టిస్తున్నారట. మరీ ఈ వార్త ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.