Niharika విషయంలో భయపడిపోతున్న NagaBabu అసలేమైదంటే?

by samatah |   ( Updated:2023-07-18 03:32:00.0  )
Niharika విషయంలో భయపడిపోతున్న NagaBabu అసలేమైదంటే?
X

దిశ, వెబ్‌డెస్క్ : మెగా డాటర్ నిహారిక విషయంలో నాగబాబుకు భయం పట్టుకుందంట. ఎందుకు, అసలేమైంది అనుకుంటున్నారా?ఎంతో అంగరంగవైభవంగా జొన్నలగడ్డ చైతన్యకు,నిహారికను ఇచ్చి పెళ్లి చేసిన విషయం తెలిసిందే. ఇక ఎంతో ఆనందంగా ఉంటారు అనుకున్న వారు విడాకులు తీసుకొని విడిపోయారు.

ఈమధ్యనే వారు విడాకులు తీసుకున్నట్లు అఫిషియల్‌గా ప్రకటించారు. ఈ క్రమంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి నిహారక జాతకం గురించి షాకింగ్ విషయాలు తెలిపిన విషయం తెలిసిందే. నిహారిక మొదటి పెళ్లి పెటాకులు అవుతుందని, రెండో పెళ్లి చేసుకున్నా అంతగా కలిసి రాదు, సంతానం కూడా కలగదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇక చాలామంది సెలబ్రిటీల విషయంలో వేణు స్వామి చెప్పింది జరగడంతో నిహారిక విషయంలో కూడా అలాగే జరుగుతుంది అని నాగబాబు భయపడిపోతున్నారట. తన కూతురి జీవితం ఎలా ఉంటుందో అంటూ తన స్నేహితుల వద్ద చెప్పుకుంటూ చాలా బాధపడ్డాడంట.

Also Read: క్లిన్ కారా కోసం నైట్ డ్యూటీలు చేస్తున్న రామ్ చరణ్ పెద్ద కూతురు? ఎవరో తెలుసా?

Advertisement

Next Story