మా అమ్మకు పెద్ద ఇల్లు గిఫ్ట్‌గా ఇస్తా: సంతోష్‌ శోభన్‌

by Prasanna |   ( Updated:2023-05-14 07:27:02.0  )
మా అమ్మకు పెద్ద ఇల్లు గిఫ్ట్‌గా ఇస్తా: సంతోష్‌ శోభన్‌
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్‌ శోభన్‌, నందినీ రెడ్డి కాంబోలో వస్తున్న చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. మాళవికా నాయర్‌ హీరోయిన్‌గా నటించిన మూవీ మే 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హీరో.. ‘ఈ చిత్రంలో నేను రిషి పాత్రలో కనిపిస్తాను. ‘అలా.. మొదలైంది’ చూసి నందినీరెడ్డిగారితో ఓ సినిమా చేయాలనుకున్నా. మొత్తానికి నా కోరిక తీరింది. యాక్టర్‌‌గా నాకు తొలి అడ్వాన్స్‌ చెక్‌ ఇచ్చింది ప్రియాంకా దత్‌గారు. ఈ సినిమా అవుట్‌పుట్‌ బాగా రావడం నాకు బోనస్‌. ఇండస్ట్రీకి వచ్చి 13ఏళ్లు అవుతోంది. నాకు అవకాశాలు లేనపుడు అమ్మ నమ్మకమే ధైర్యాన్ని ఇచ్చింది. ఇప్పటికి మాకు సొంత ఇల్లు లేదు. త్వరలోనే మా అమ్మకు పెద్ద ఇంటిని గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నా’ అని చెప్పాడు.

Also Read..

Prabhas : భద్రాద్రి రామయ్యకు భారీ విరాళం ఇచ్చిన ప్రభాస్!

Advertisement

Next Story