‘Adipurush’ మోడ్రనైజ్ ఎఫెక్ట్.. ‘హనుమాన్’ సినిమాపై డైరెక్టర్ క్లారిటీ

by Hamsa |   ( Updated:2023-06-17 06:14:57.0  )
‘Adipurush’ మోడ్రనైజ్ ఎఫెక్ట్.. ‘హనుమాన్’ సినిమాపై డైరెక్టర్ క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘హనుమాన్’. ఇందులో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్ మూవీపై భారీ అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా ఈ చిత్రంలోని విజువల్స్ చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో హనుమాన్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు.

అయితే రామాయణం బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చిన ఆదిపురుష్ జూన్ 16న విడుదలై పలు ట్రోల్స్‌ను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అందులో రాముడిని ఈ జనరేషన్‌కు తగ్గట్టుగా మోడ్రన్‌గా తెరకెక్కించారని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో హనుమాన్ సినిమాపై అందరి దృష్టి పడింది. తాజాగా, ప్రశాంత్ వర్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని హనుమాన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ మేము రిస్క్ చేయడం లేదు. హనుమాన్‌ను మోడ్రనైజ్ చేసి చూపించడం లేదు. చిన్నతనం నుంచి హనుమంతుడు అందరికీ ఎలా తెలుసో.. అలాగే చూపిస్తున్నాను. హనుమంతుని పాత్ర కోసమే మేమందరం ఏడాది పాటు రీసెర్చ్ చేశాము’’ అని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: పరిస్థితి ఇలా ఉన్నా ప్రభాస్ ఎందుకు మౌనంగా ఉన్నారు?

Advertisement

Next Story