ఉషా పరిణయం థియేటర్స్‌లో చూసి సక్సెస్ చేయాలి: సాయి ధరమ్ తేజ్

by Hamsa |
ఉషా పరిణయం థియేటర్స్‌లో చూసి సక్సెస్ చేయాలి: సాయి ధరమ్ తేజ్
X

దిశ, సినిమా: నువ్వేకావాలి, మ‌న్మ‌థుడు, మ‌ల్లీశ్వ‌రి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె.విజ‌య్‌భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో ల‌వ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ రాబోతుంది. ‘ఉషా ప‌రిణ‌యం’ అనే బ్యూటిఫుల్ టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రానికి ల‌వ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉప‌శీర్షిక‌. కె.విజ‌య్‌భాస్క‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ చిత్రంలో శ్రీ‌క‌మ‌ల్‌, తాన్వీ ఆకాంక్ష‌, సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు 2న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగా సుప్రీమ్‌ హీరో సాయి ధరమ్ తేజ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా

మెగా హీరో మాట్లాడుతూ 'తన్వీ ఆకాంక్షకు అన్నయ్యగా ఈ ఫంక్షన్‌కు వచ్చాను. విజయ్‌భాస్కర్‌ దర్శకత్వంలో నేను ప్రేమకావాలి అనే సినిమా చేయాల్సింది అది మిస్‌ అయ్యింది. నేను రేయ్ చేశాను.. ఆది ప్రేమ కావాలి చేశాడు. కమల్‌ నాకు జిమ్‌లో పరిచయం మంచి హార్డ్‌వర్కర్‌. ఈ రోజు హీరోగా చేయడం హ్యపీగా ఉంది. నాకు ఎంతో ఆప్తుడు అయిన సతీష్‌ అన్న కూతురు ఈ చిత్ర హీరోయిన్‌ తన్వీ. తన్వీ కూడా మా రికమండేషన్‌తో ఈ సినిమా చేయడం లేదు. ఎంతో కష్టపడి షార్ట్‌ ఫిల్మ్స్‌ చేసి ఈ అవకాశం పొందింది. 'ఉషా పరిణయం' చిత్రాన్ని అందరూ థియేటర్‌కు వెళ్లి చూసి సక్సెస్‌ చేయాలి అన్నారు.

దర్శకుడు విజయ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ.. సాయి దుర్గ తేజ్‌ హీరోగానే కాకుండా సమాజం గురించి కూడా ఆలోచిస్తాడు. పద్నాలుగేళ్ల తర్వాత సాయిను చూస్తున్నాను. సాయిని 14 ఏళ్ల క్రితం పవన్‌కల్యాణ్‌ గారి నిర్మాణ సారథ్యంలో నేనే హీరోగా ఇంట్రడ్యూస్‌ చేయాలి కానీ కుదరలేదు. ఆ రోజు ఎంత వినయంగా, సంస్కారంతో ఉన్నాడో.. ఈ రోజు అలాగే ఉన్నాడు. చిరంజీవి గారి దగ్గర ఉన్న ప్రేమ సాయిలో కనిపించింది. మమ్ములను టీమ్‌ను ఎంకరైజ్‌ చేయడానికి వచ్చినందుకు ఆనందంగా ఉంది. నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా ఫ్యామిలీ సపోర్ట్‌తో ఈ సినిమా నిర్మించాను. తన్వీ స్వీటెస్ట్‌ గర్ల్‌. చాలా కంఫర్టబుల్‌ హీరోయిన్‌. నో ప్రాబ్లెమ్‌ గర్ల్‌. కాశ్మీర్‌లో ఎంత ఇబ్బంది అయినా అంత చలిలో కూడా ఎంతో సహకరించింది అన్నారు.

Advertisement

Next Story