పెదవులు, బుగ్గలు పర్‌ఫెక్ట్‌‌గా ఉండాలి.. లేదంటే ఖేల్ ఖతమ్..

by Prasanna |   ( Updated:2023-05-01 09:15:29.0  )
పెదవులు, బుగ్గలు పర్‌ఫెక్ట్‌‌గా ఉండాలి.. లేదంటే ఖేల్ ఖతమ్..
X

దిశ, సినిమా : యంగ్ బ్యూటీ వామికా గబ్బి కొంతకాలంగా తాను చేస్తున్న పనిపట్ల సంతోషంగా లేనంటోంది. నటనా పరంగా చాలామంది తనను అభినందించినప్పటికీ మహిళలు సౌందర్యపరంగా పరిపూర్ణంగా కనిపించాలనే ఆడియన్స్ ఒపీనియన్‌తో ఆశ్చర్యపోయానని చెప్పింది. ‘నేను పాత్రతోనే ప్రేమలో పడాలనుకుంటాను. కానీ కొంతమంది మాటల పట్ల విసుగుచెందాను. అందుకే 2019లో నటన నుంచి తప్పుకోవాలనుకున్నా. అందం కోసం ఆరాటపడటం మానేసి ప్రకృతిని ఆస్వాదించడం ప్రారంభించాను. దాదాపు రెండేళ్ల నుంచి నా దృక్పథం పూర్తిగా మారిపోయింది. అయితే ఇన్నాళ్లకు ఒక గొప్ప ప్రాజెక్ట్‌లో నన్ను ఎంపిక చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. గొప్ప నటిగా నిరూపించుకునేందుకు ఇదొక సవాల్. మన పరిశ్రమ కేవలం స్త్రీల ముఖాలతోనే నిమగ్నమై ఉంది. ముఖం, పెదవులు, బుగ్గలు పర్ఫెక్ట్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే నేను అన్నింటికీ దూరంగా ఉండాలనుకుంటున్నా’ అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.

Advertisement

Next Story

Most Viewed