'waltair veerayya' లో Ravi Teja First Look

by sudharani |
waltair veerayya లో Ravi Teja First Look
X

దిశ, సినిమా: టాలీవుడ్ లెజెండ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ "వాల్తేరు వీరయ్య". దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా కంప్లీట్ అవుతోంది. రిలీజ్ డేట్ కోసం అయితే అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో మాస్ హీరో రవితేజ నటిస్తున్న విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత చిరు, రవితేజ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ నెలకొంది.

ఇక ఇప్పటి వరకు చిరంజీవి ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్, ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసి, సినిమాపై బాగానే బజ్ పెంచారు. తాజాగా ఈ మూవీ మేకర్స్ రవితేజ ఫస్ట్ లుక్‌కి సంబంధించిన అనౌన్స్ మెంట్ చేస్తూ.. తాజాగా మాస్ మాహారాజా ఫస్ట్‌‌లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో రవితేజ ఏసీపీ విక్రమ్ సాగర్ పాత్రలో కనిపించనున్నారు. ఓ చేతిలో మేకపిల్లను, మరో చేతిలో గొడ్డలిని పట్టుకుని సిలిండర్‌ని లాగుతున్న రవితేజ.. పవర్ ఫుల్ యాక్షన్‌కు సిద్ధమైనట్లు కనిపించారు. ఇందులో మాస్ రాజా భాష కూడా మార్చారు. పూర్తి తెలంగాణ యాసలో మాట్లాడారు. ఈ లుక్‌‌తో చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో పెరిగిపోయాయి.

ఇవి కూడా చదవండి :

Pathaan' song 'Besharam Rang:'లో' దుస్తుల్లో కనిపించి షారుఖ్‌ను రెచ్చగొట్టిన దీపిక


Advertisement

Next Story

Most Viewed