ప్రభాస్ కోసం వెయిటింగ్.. అంటూ సచిన్ టెండూల్కర్ కూతురు సారా ఇంట్రెస్టింగ్ పోస్ట్!

by Hamsa |   ( Updated:2023-11-23 13:08:05.0  )
ప్రభాస్ కోసం వెయిటింగ్.. అంటూ సచిన్ టెండూల్కర్  కూతురు సారా ఇంట్రెస్టింగ్ పోస్ట్!
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ మామూల్‌గా ఉండదు. ఆయన సినిమా విడుదలువుతుంది అనగానే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. డార్లింగ్ చేతిలో ప్రస్తుతం ఉన్న చిత్రాలన్నీ పాన్ ఇండియా సినిమాలే. ఇక అందులో ఒకటి ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేశారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 1 న సలార్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ ట్రైలర్ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, సచిన్ టెండ్కూల్కర్ కూతురు సారా ప్రభాస్‌పై ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ‘‘సలార్ ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా ఆమె ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేసింది. దీంతో అది చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ అయ్య బాబోయ్.. సారా.. నువ్వు కూడా ప్రభాస్ ఫ్యాన్స్ యేనా.. సూపర్.. సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం సారా పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Advertisement

Next Story