చెల్లి పెళ్లికి న్యూడ్ డ్యాన్సర్లను రప్పించి పరువు తీసింది: భార్యపై నరేష్ ఆరోపణలు

by Prasanna |   ( Updated:2023-01-28 07:06:39.0  )
చెల్లి పెళ్లికి న్యూడ్ డ్యాన్సర్లను రప్పించి పరువు తీసింది: భార్యపై నరేష్ ఆరోపణలు
X

దిశ, సినిమా : యాక్టర్ వి.కె.నరేష్‌ తన భార్య రమ్య రఘుపతిపై సంచలన ఆరోపణలు చేస్తున్నాడు. తనను రూ.10 కోట్లు ఇవ్వాలని బెదిరించడంతోపాటు హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్‌తో కలిసి కుట్ర పన్నిందంటున్నాడు. అంతేకాదు తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చిన నరేష్.. తనకు రమ్య విషం పెట్టి చంపాలని చూసిందని, అందులో భాగంగానే బీహార్‌ నుంచి మనుషులను రప్పించిందన్నారు. 'పవిత్రతోనే ఉంటా. అది నా ఇష్టం. విజయనిర్మల దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా జాయిన్ అయిన రమ్య సింపతి బిల్డప్ చేసుకుని నాటకాలాడింది. ఆ తర్వాత ఆమెలో అసలు క్యారెక్టర్‌ బయటపడింది. పెళ్లైన నెలరోజులకే నన్ను వేధించడం మొదలుపెట్టింది. సరిగా తిండి పెట్టేది కాదు. కొడుకును బాగా కొట్టేది. ఫంక్షన్ ఏదైనా సరే తాగి రచ్చరచ్చ చేసేది. ఒకసారి హిందూపురంలో బాగా తాగి బంధువులముందే మత్తులో భూతులు తిట్టింది. తన కజిన్ సిస్టర్ పెళ్లికి ముంబై న్యూడ్ క్యాబరే డ్యాన్సర్లను రప్పించి రచ్చ చేసింది' అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read...

ఎట్టి పరిస్థితుల్లో నరేష్‌తో విడాకులకు ఒప్పుకోను: Ramya

Advertisement

Next Story