- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇండస్ట్రీలో అదొక భయంకరమైన అంటువ్యాధి.. నిజం మాట్లాడితే పాతాలానికి తొక్కేస్తారు
దిశ, సినిమా : బాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ పోటీదారుగా నిలవకపోవడంపై సీనియర్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఓపెన్ అయ్యాడు. ఈ మేరకు చిత్ర పరిశ్రమలో ఉన్నంతకాలం ఆయన చర్చించిన ప్రతి విషయం ఓపెన్ సీక్రెట్ అని చెప్పాడు. అయితే తన నిజాయితీని కొంతమంది తప్పుదోవ పట్టించారని, ఇంతకంటే ఘోరమైన దుర్మార్గం మరొకటి లేదని వాపోయాడు. ‘కొన్ని అవకతవకల కారణంగా సూపర్ స్టార్‌డమ్‌ను సాధించడంలో విఫలమయ్యాను. బయటి శక్తుల కారణంగా నన్ను నేను నిరూపించుకునే అవకాశాలు రాలేదు. చాలా నిస్సహాయంగా ఫీల్ అయ్యాను. చాలాసార్లు విసుగు చెందాను. నాకు తెలిసి సినిమా ఫెయిల్యూర్ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ వ్యక్తులను తొక్కేయాలనే ప్రయత్నాలు మళ్లీ మళ్లీ జరుగుతున్నపుడు ఎవరైనా మానసికంగా నలిగిపోతారు. నా విషయంలో ఇంతకంటే అధ్వాన్నంగా ఏమీ లేదని భావించాను. ఎలా జరుగుతుందో తెలిసినా కొన్నిసార్లు ఏమీ చేయలేకపోయా. దీనికి బాధ్యులు ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది బహిరంగ రహస్యం. ఈ అంటు వ్యాధికి దూరంగా ఉండాలి’ అంటూ తన ఫీలింగ్స్ బయటపెట్టాడు.