ప్రభాస్ ‘సలార్‌’కు పోటీగా ‘ది వ్యాక్సిన్‌ వార్‌’.. వివేక్ అగ్నిహోత్రి అసలే తగ్గట్లేదు

by samatah |   ( Updated:2023-08-15 11:27:07.0  )
ప్రభాస్ ‘సలార్‌’కు పోటీగా ‘ది వ్యాక్సిన్‌ వార్‌’.. వివేక్ అగ్నిహోత్రి అసలే తగ్గట్లేదు
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ భాషతో సంబంధం లేకుండా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ప్రభాస్ మూవీ థియేటర్‌లో రిలీజ్ అవుతుందంటే ఎలాంటి సినిమాలైనా పక్కకు తప్పుకోవాల్సిందే. అలాంటిది బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మాత్రం ప్రభాస్‌కు పోటిగా రాబోతున్నాడు. ప్రభాస్‌ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘సలార్‌’ సెప్టెంబర్‌ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ కూడా సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నాడట. కరోనా వైరస్‌ నుంచి ప్రజలను రక్షించడానికి వ్యాక్సిన్‌ ఎలా కనిపెట్టారు? ఆ సమయంలో ఎలాంటి ఛాలెంజ్‌లు ఎదురయ్యాయి? అనే ఆసక్తికర అంశాలతో ఈ మూవీ రాబోతుందట. మొత్తానికి అగ్నిహోత్రి, ప్రభాస్ మూవీకి పోటీగా వస్తూ పెద్ద సాహసమే చేస్తున్నాడు.

Read More: బాలీవుడ్ స్టార్ హీరోకు ఇండియన్ సిటిజన్ షిప్.. ట్విట్టర్ వేదికగా క్లారిటీ

Advertisement

Next Story