Vishwambhara : కొత్త ప్రపంచానికి తీసుకెళ్తుంది.. భారీ అంచనాలను పెంచేసిన డైరెక్టర్ కామెంట్స్!

by Hamsa |
Vishwambhara : కొత్త ప్రపంచానికి తీసుకెళ్తుంది.. భారీ అంచనాలను పెంచేసిన డైరెక్టర్ కామెంట్స్!
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’. ఇందులో స్టార్ బ్యూటీ త్రిష, అషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే ఇందులో మరో ముగ్గురు కూడా నటించబోతున్నట్లు టాక్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2025లో జనవరి 10న సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వశిష్ట విశ్వంభర సినిమాపై భారీ అంచనాలను పెంచాడు.

‘‘విశ్వంభర సినిమా చిరంజీవి కెరీర్ మొత్తంలో టాప్ 10 సినిమాలు ఉంటే అందులో టాప్ 3లో ఇదే అవుతుంది. జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ గురించి ఇప్పటికీ ఎలా చెప్పుకుంటారో విశ్వంభర గురించి కూడా అలా చెప్పుకుంటారు. చాలా మంది స్టార్స్‌తో కలిసి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నా. ఆ ప్రపంచం డిస్నీ ఫిలిమ్స్‌లో చూపించినట్టు కొత్తగా గ్రాండ్‌గా ఉంటుంది. ఈ సినిమా చాలా పెద్ద రేంజ్‌లో ఉంటుంది. ఆడియన్స్‌కి థ్రిల్ ఇస్తుంది’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతుండగా.. మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

Next Story