- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టేజీ పైనే విశ్వక్ సేన్, నేహాశెట్టి రొమాన్స్.. వైరలవుతోన్న వీడియో
దిశ, వెబ్‌డెస్క్: హీరో విశ్వక్ సేన్.. డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వంతో తెరకెక్కుతోన్న సినిమా ‘ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఈ చిత్రంలో డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీలో తెలుగు హీరోయిన్ అంజలి కీలక పాత్రలో యాక్ట్ చేస్తోంది. ఇక, ఈ సినిమాలో ఇందులో విశ్వక్ మునుపెన్నడూ చూడని భిన్నమైన పాత్రలో కనిపించనున్నాడు. క్రూరమైన, నేరపూరితమైన చీకటి సామ్రాజ్యంలో కామన్ మ్యాన్ నుంచి ధనవంతుడిగా ఎదగాలని కోరుకునే వ్యక్తి కథగా ఈ మూవీ సాగుతుంది. అయితే ఈ సినిమా నుంచి తాజాగా ‘సుట్టంలా సూసి పోకల’ పాట రిలీజ్ చేశారు.
ఈ ఈవెంట్‌లో హీరో, హీరోయిన్ తెగ రెచ్చిపోయి.. స్టేజీ మీదనే రొమాంటిక్‌గా డాన్స్ చేశారు. నేహా తన చీరను విశ్వక్‌కు కప్పుతుంది. హీరో ఆమె కొంగును తీసుకొని తనకు చుట్టుకుంటూ.. నేహాను హత్తుకుంటాడు. దీంతో అక్కడున్న ప్రేక్షకులంతా కేకలు పెడుతూ, వారి డాన్స్‌ను ఎంకరేజ్ చేసేలా కేకలు వేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో వీక్షించిన నెటిజన్లు కొంతమంది పాజిటివ్ కామెంట్లు చేయగా.. మరికొంత మంది ‘‘నిన్న సమంత, విజయ్ దేవరకొండ.. ఇవ్వాలా విశ్వక్, నేహా భాగోతం బాగుంది’’ అంటూ నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు.