బర్త్ డే రోజే ‘బ్యాడ్’గా మారిన విశ్వక్ సేన్

by Vinod kumar |   ( Updated:2023-03-29 14:07:51.0  )
బర్త్ డే రోజే ‘బ్యాడ్’గా మారిన విశ్వక్ సేన్
X

దిశ, సినిమా: యంగ్ హీరో విశ్వక్ సేన్ పుట్టినరోజు సందర్భంగా మరోకొత్త చిత్రం ‘బ్యాడ్’ ఘనంగా ప్రారంభమైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం 21గా వస్తున్న సినిమాను.. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇక కృష్ణ చైతన్య దర్శకత్వం వహించనున్న ఈ మూవీ ప్రారంభం సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఇందులో రాత్రిపూట నిర్మానుష్య ప్రాంతం నుంచి సరుకుతో ఉన్న మూడు లారీలు బయల్దేరి పోర్టుకి వెళ్తుండగా.. ‘సామాజిక నిబంధనలను ధిక్కరించే ప్రపంచంలో బ్లాక్ ఉండదు, వైట్ ఉండదు, గ్రే మాత్రమే ఉంటుంది’ అని చెప్పే డైలాగ్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది. ఇక ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నాడు.

Read more:

విడాకులపై స్టార్ హీరోయిన్ సమంత సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story