‘నన్ను ఎవరూ ఆపుతారో చూస్తా’.. నిర్మాతల మండలికి హీరో విశాల్ స్ట్రాంగ్ వార్నింగ్..!

by Satheesh |
‘నన్ను ఎవరూ ఆపుతారో చూస్తా’.. నిర్మాతల మండలికి హీరో విశాల్ స్ట్రాంగ్ వార్నింగ్..!
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ మూవీ ఇండస్ట్రీలో స్టార్ హీరో విశాల్ వర్సెస్ నిర్మాతల మండలి మధ్య వివాదం ముదురుతోంది. గతంలో నిర్మాతల మండలి అధ్యక్షుడి కొనసాగిన విశాల్ నిధులు దుర్వినియోగం చేశాడన్న ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో ఇకపై విశాల్‌తో ఎవరూ సినిమా చేయాలన్న తమ అనుమతి తీసుకోవాల్సిందేనని తమిళ నిర్మాతల మండలి కండిషన్ పెట్టినట్లు సినీ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దర్శకుడి నుండి టెక్నిషియన్ వరకు ఎవరైనా సరే విశాల్‌తో కలిసి వర్క్ చేయాలనుకుంటే తప్పక తమ అనుమతి తీసుకోవాల్సిందేనని అల్టిమేటం జారీ చేసినట్లు టాక్. ఈ క్రమంలో నిర్మాతల మండలి కండిషన్లపై హీరో విశాల్ రియాక్ట్ అయ్యారు. నన్ను సినిమాలు చేయకుండా ఎవరూ ఆపలేరని, నేను మూవీస్ చేస్తూనే ఉంటానని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

తాను తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుండి మంచే చేశానని.. నిధులను వారి సంక్షేమం కోసమే ఉపయోగించానని ఆరోపణలకు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు నిర్మాతల మండలిలో ఉన్నవారు గతంలో నా కింద సభ్యులుగా ఉన్నవారేనని.. వారికి నిజాలు అన్నీ తెలుసని అన్నారు. తమిళ సినీ పరిశ్రమలో అనేక సమస్యలు ఉన్నాయని.. నిర్మాతలు మొదట వాటిపై పోరాడితే బాగుంటుందని కౌంటర్ ఇచ్చారు. నన్ను సినిమాలు తీయకుండా ఎవరూ ఆపుతారో చూస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు విశాల్. మరీ విశాల్ కామెంట్స్‌పై నిర్మాతల మండలి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది..? ఈ వివాదం చివరకు ఎక్కడకు దారి తీస్తుందన్నది తమిళ్ మూవీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story